బాన్సువాడ మండలంలో ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు తాసిల్దార్ వరప్రసాద్ కు వినతి పత్రాన్ని అందజేశారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్ కు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గద్దెనెక్కిన తర్వాత మరిచిపోయారని ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలుపరచడంలో శ్రద్ధ చూపడం లేదని బాన్సువాడ బిజెపి పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి ఆరోపించారు.