చింతకాని మండలం లచ్చగూడెం, నేరడ గ్రామాల్లో భారీ వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతిన్న పత్తి, పెసర పంట పొలాలను టీడీపీ నాయకులు పరిశీలించారు. టీడీపీ పార్లమెంటరీ కమిటీ కన్వీనర్ వాసిరెడ్డి రామనాథం మాట్లాడుతూ, రైతులు తీవ్రంగా నష్టపోయారని, వెంటనే సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.