రైతులకు ఒకే ఆధార్ నంబర్ పై ఒకే నెలలో ఎక్కువగా యూరియా బస్తాలు ఇచ్చే డీలర్ల పై టాప్ 20 బయ్యర్స్ కింద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని గురువారం మధ్యాహ్నం గంట్యాడలో మండల వ్యవసాయఅధికారి శ్యాం కుమార్ హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రైతులకు సంబంధించిన వన్ బి ఆధార్ పరిశీలించిన తర్వాతనే ఒకటి లేదా రెండు బస్తాల యూరియా ఇవ్వాలని సూచించారు. రైతులందరూ సహకరించాలని కోరారు.