ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో ఈనెల 3వ తేదీన జరిగిన హత్య ఘటనపై సోమవారం మధ్యాహ్నం 4 గంటలకు డిఎస్పి నాగరాజు మీడియాకు వెల్లడించారు. హత్యకు గురైన గాలి బ్రహ్మయ్య ను అతని స్నేహితుడు వెంకట సాయి తేజ ఇద్దరు మైనర్ స్నేహితులతో కలిసి హత్య చేసినట్లుగా గుర్తించామని డిఎస్పి అన్నారు. వెంకట సాయి తేజ ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకునే క్రమంలో బ్రహ్మయ్య ఆ అమ్మాయికి ఆమె తండ్రికి వెంకట సాయి తేజ పై చెడ్డగా చెప్పాడంటూ కక్ష పెంచుకున్న వెంకట సాయి తేజ 15 రోజుల క్రితమే బ్రహ్మయ్యను హత్య చేసేందుకు పథకం ప్రకారం సిద్ధమైనట్లుగా అన్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.