కూటమి ప్రభుత్వం కు ప్రజల సుఖ సంతోషాలు ముఖ్యమని అందుకే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి సూపర్ హిట్ అన్న ప్రశంస తెచ్చుకున్నదని రాష్ట్ర మంత్రి టి.జి.భరత్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సందర్భంగా పేర్కొన్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు కర్నూలు కొత్తపేటలోని క్లస్టర్ 12 మంగలి వీధిలో మంత్రి టి. జి. భరత్ 15 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు విచారించి పెన్షన్ల పంపిణీ చేశారు. మంత్రి ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగాపని చేస్తున్నది అన్న విషయాలు వారిని ప్రశ్నించగా వారు మేము ఈ ప్రభుత్వంలో చాలా