నిర్మల్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య శాంతియుతంగా ముగిశాయి. నిన్న రాత్రి వరకు సాగిన వినాయక నిమజ్జన కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. నిమజ్జనం ఉత్సవాల ముగిసిన సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నిమజ్జన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తుగా తీసుకున్న చర్యల వలన ఎక్కడా లోటుపాట్లు లేకుండా కార్యక్రమం పూర్తయింది తెలిపారు.