జగిత్యాల జిల్లా సమీకృత భవన సముదాయంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నూతనంగా శుక్రవారం భాద్యతలు చేపట్టిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజగౌడ్ మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను కలిసి పుష్పగుచ్చం అందించారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ రాజగౌడ్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో జిల్లా అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాధ్యతగా విధులు నిర్వహిస్తానని తెలిపారు.