ప్రధానమంత్రి మాతృమూర్తిపై అసభ్యంగా మాట్లాడిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం 5:00 సమయంలో అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి నాయకులు ర్యాలీ చేపట్టారు. దేశంలో బిజెపి పోటీని తట్టుకోలేక రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి నాయకున్ని భారత దేశ ప్రజలు క్షమించబోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే భారత ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ఆందోళనలు పెద్ద ఎత్తున ఉదృతం చేస్తామన్నారు.