తాళ్లపూడి మండలం అన్నదేవరపేట లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అధికారుల తీరుపై ఎమ్మెల్యే ముప్పిడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో, తహసిల్దార్ వంటి ముఖ్య అధికారులు గైర్హాజరు కావడంతో పాటు, ఆసుపత్రి ఆవరణ మొత్తం పిచ్చి మొక్కలతో నిండి ఉండటాన్ని చూసి ఆయన మండిపడ్డారు. పంచాయితీ, ఆరోగ్య శాఖల అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు.