అమలాపురం స్థానిక కలెక్టరేట్ నందు జాతీయ సహజ వ్యవసాయ మిషన్ అమలులో భాగంగా ఏపీ ప్రజాభాగస్వామ్య ప్రకృతి సేంద్రియ వ్యవసాయం పద్ధతులపై వ్యవసాయ అనుబంధ విభాగాలతో కన్వర్జెన్స్ సమావేశం కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో వార్షిక కార్యాచరణ ప్రణాళికలపై సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు, జిల్లా పశుసంవర్ధక అధికారి వెంకట్రావు ఇతర అధికారులు రైతులు పాల్గొన్నారు