కర్నూలు నగరంలో చేపడుతున్న సుందరీకరణ, రోడ్ల నిర్మాణ పనులను సెప్టెంబర్ 30 వ తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.మంగళవారం ఉదయం 12 గంటలు కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల, విజ్ఞాన మందిర్, బంగారు పేట, మున్సిపల్ కార్యాలయం, సుంకేసుల రోడ్, తదితర ప్రాంతాల్లో కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ, రోడ్డు నిర్మాణం, సుందరీకరణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు...