Parvathipuram, Parvathipuram Manyam | Aug 24, 2025
కార్మిక హక్కులు హరిస్తున్న ప్రభుత్వాలపై తిరగబడి పోరాడాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏకగ్రీవంగా తీర్మానించింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నాలుగవ మహాసభలను నిర్వహించారు. ఈ మహాసభలకు ముందు గాంధీనగర్ నుండి డీలక్స్ సెంటర్, చిన్నబజార్ జంక్షన్, బోసుబొమ్మ జంక్షన్, మీదుగా డబ్బివీధిలోని కళ్యాణమండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రారంభమైన మహాసభలో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి రమణారావు, మన్మధరావు మాట్లాడారు.