బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకొని ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు ఆరని శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డిలతో మల్లారెడ్డి ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలు తిరుపతిలో వెలిశాయి. దీంతో మల్లారెడ్డి పార్టీ మార్పుపై ఆసక్తి నెలకొంది.