జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆద్వర్యంలో మంగళవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వై ఎస్ ఆర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి, మౌనం పాటించి నివాళులర్పించారు.ఫీజు రీంబర్స్మెంట్ ప్రవేశపెట్టి నిరుపేదలకు ఉన్నత, సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారనీ,ఆరోగ్యశ్రీ పథకంతో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి ఆస్పత్రుల్లో లక్షలాది మందికి ఉచిత వైద్యం అందించిన వై ఎస్ని రాజశేఖర్ రెడ్డి పేదల గుండెల్లో నిలిచిపోయారన్నారు.