నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో శుక్రవారం సాయంత్రం నుండి గణేష్ నిమజ్జన మహోత్సవంలో కొనసాగుతున్న ఉద్రిక్తత వాతావరణ శనివారం రాత్రి ముగిసింది. కర్నూల్ రేంజ్ డిఐజి పోయే ప్రవీణ్ వెలుగోడు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి నిన్న మధ్యలో ఆగిపోయిన నిమజ్జనం ఈరోజు కొనసాగించుకోవచ్చని నిర్వాహకులకు అనుమతించారు. దీంతో హిందూ సంఘాలు, విశ్వహిందూ పరిషత్ సంఘం సభ్యులు నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకున్నారు