అల్లూరి జిల్లా పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 35 కేజీలు గంజాయి ముగ్గురు స్మగ్లర్లను పట్టుకున్నామని టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఉదయం 10గంటల సమయంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజారావు ఇచ్చిన వివరాలు ప్రకారం అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో పాడేరు మండలం సంత బయలు వద్ద కాపు కాసి పల్సర్ బైక్ పై తరలిస్తున్న 35 కేజీల గంజాయితో ముగ్గురిని అరెస్టు చేసామని తెలిపారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఈ గంజాయిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండగా కొనుగోలు అమ్మకుందారులను చాకచక్యంగా పట్టుకున్నామని వెల్లడించారు.