జిల్లాలోని గోకవరం మండలం అచ్చయ్యపేట గ్రామానికి చెందిన రొబ్బి వెంకట సత్యవతి ఆస్తి వివాదం పరిష్కారమైందని ఈ మేరకు ఆమెకు ఉత్తర్వులు అందజేసినట్టు రాజమండ్రి ఆర్డీవో కృష్ణ నాయక్ శనివారం తెలిపారు. సత్యవతి మూడవ కుమారుడు లక్ష్మీ మధుసూదన్ రావు మోసపూరితంగా దాన సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో దానిపై విచారం నిర్వహించి ఆస్తిపై వివాదాలు తొలగించి సత్యవతికి అవసరమైన ఉత్తర్వులు పత్రాలను అందజేసినట్టు తెలిపారు.