చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి రైతు సేవా కేంద్రంలో 30 టన్నులు యూరియా సిద్ధంగా ఉందని చింతూరు సీఐ గోపాలకృష్ణ తెలిపారు. యూరియా అమ్మకాలను ఆయన సోమవారం సాయంత్రం పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. రైతులందరికి అందేలా చూడాలన్నారు. ముందుగా వచ్చిన వారికి టోకెన్స్ అందజేయాలన్నారు. రైతులు తొందరపడి అధిక మొత్తంలో యూరియా కొనుగోలు చేయవద్దని సూచించారు. ఎస్ఐ రమేష్, అగ్రికల్చర్ సిబ్బంది పాల్గొన్నారు.