తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు సోమవారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. రిలే నిరహార దీక్షలు చేస్తున్న ఉద్యోగులకు అఖిల భారత మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సల్మాన్ రాజు, బాషా మద్దతు తెలియజేశారు. ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కండక్టర్ పద్మను సస్పెండ్ చేయడం అక్రమమని వారు ఖండించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో ఆర్డీవో కార్యాలయంలో సమస్యను విన్నవిస్తూ వినతి పత్రం అందజేశారు. అక్రమ సస్పెండ్ కు గురైన కండక్టర్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.