కరీంనగర్ లోని రాంనగర్ లో ప్రతిష్టించిన 35 అడుగుల గణనాథుడు శనివారం సాయంత్రం నిమజ్జనం జరిగింది. కరీంనగర్ పట్టణంలోని అతిపెద్ద వినాయకుడు కావడంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలు మేరకు కరీంనగర్ లోని అన్ని వినాయకులు శుక్రవారం నిమర్జనం జరిగితే...రాంనగర్ గణనాథుడు మాత్రం శనివారం భారీ భద్రత నడుమ చింతకుంట SRSP కెనాల్ నిమర్జనం చేశారు. అయితే కరీంనగర్ టూటౌన్ సిఐ సృజన్ రెడ్డి పర్యవేక్షణలో ఎలక్ట్రిసిటీ అధికారుల సమన్వయంతో భారీ గణనాథ విగ్రహానికి విద్యుత్ తీగలు అడ్డురావడంతో అధికారులు తొలగించి.. నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. అఖిల్ గౌడ్ ఆధ్వర్యంలో నవరాత్రులు వైభవంగా కొనసాగాయి.