వెంకటాపురం మండలం రామచంద్రపురం గ్రామంలో ఇసుక లారీ నేడు శనివారం సాయంత్రం 5 గంటలకు దిగబడింది. ఈ రోడ్డులో కంకర వేయాల్సి ఉండగా మట్టి వేశారు. దీంతో ఈ మట్టి రోడ్డు వర్షాలకు బురద రోడ్డుగా మారిపోయింది. ఈ రోడ్డున వెళ్తున్న ఆటోలు, బైకులు, లారీలు, కార్లు అన్ని దిగబడుతున్నాయి. శనివారం ఉదయం అటుగా వెళ్లిన లారీ దిగబడగా.. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ రాకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.