రైతులు ఉల్లిని ఆరబెట్టి, గ్రేడింగ్ చేసుకొని మార్కెట్ యార్డుకు తీసుకు రావాలని, మార్కెట్ యార్డ్ కు తెచ్చిన మొత్తం ఉల్లి కొనడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా రైతులకు తెలియజేశారు. మంగళవారం సాయంకాలం 5 గంటలకు కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా పోలకల్ గ్రామం సి.బెళగల్ మండలం కు చెందిన తెలుగు వెంకట లక్ష్మమ్మ , సంఘాల గ్రామం , బెలగల్ మండలం నాయుడు , సనగండ్ల గ్రామం గూడూరు మండలం కు చెందిన భరత్ కుమార్ రెడ్డి తెచ్చిన ఉల్లి ఉత్పత్తులను పరిశీలించారు. వీరితో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...బాగుగా ఆరబెట్టిన మరియు గ్రేడింగ్ చేసిన