ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కు ఎక్సైజ్ అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకటవ తేదీన 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు అద్భుతమైన కూటమిపాలనకు ప్రజల నుంచి అనూహ్యమైన అభినందనలు వస్తున్నాయని తెలిపారు ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు . ఇప్పటికీ కూడా ఎక్కువమంది ఉపాధ్యాయులకు ఉద్యోగ కల్పన చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు.