ప్రొద్దుటూరును కేంద్రంగా చేసుకుని లింగ నిర్ధారణ దందా కొనసాగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. స్థానికంగా తనిఖీలు, కఠిన నిబంధనలు ఉండటంతో దళారులు గర్భిణులను కర్నూలుకు తరలించి అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు డిప్యూటీ డీఎంహెచ్వో డా. గీత బుధవారం పట్టణంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక ఆసుపత్రుల్లో నేరుగా లింగ నిర్ధారణ జరుగుతున్నట్టు ఆధారాలు లేవు. అయితే ఏజెంట్ల సహాయంతో గర్భిణులను కర్నూలుకు పంపుతున్న విషయం మా దృష్టికి వచ్చిందని తెలిపారు.