Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 25, 2025
ఖననం చేసిన శవానికి పోస్టుమార్టం చేసిన ఘటన మల్హర్ రావు మండలంలోని వల్లెంకుంటలో చోటు చేసుకుంది. సోమవారం ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం వల్లెంకుంట గ్రామానికి చెందిన వేల్పుల వెంకటి(46) ఈ నెల 17న మృతి చెందగా కుటుంబ సభ్యులు. మృతుడి మరణం పై ఎలాంటి అనుమానం లేక పోవడంతో 18న అంత్యక్రియలు(పూడ్చి పెట్టడం) నిర్వహించారు. వెంకటి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో గ్రామంలో పనికి వెళ్లిన చోట విద్యుత్ షాక్కు గురైనట్లు గ్రామంలో ప్రచారం సాగడంతో భార్య రాజేశ్వరి భర్త మరణం పై అనుమానం ఉందవి 21న కొయ్యూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సోమవారం వెంకటిని పూడ్చి పెట్టిన ప్రదేశానికి చేరు