వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో యూరియా కొరత లేదని నేడు గురువారం విలేకరుల సమావేశంలో కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, డిసిసి ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుల్కచర్ల మండల కేంద్రంలో యూరియా కొరత ఉందని ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతమని పేర్కొన్నారు. 670 క్వింటాళ్ల యూరియా మండలానికి సప్లై చేశామని, కేంద్రం యురియా రవాణా సప్లై చేయడంలో జాప్యం చేస్తుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడడం జరిగిందని రేపు 200 క్వింటాళ్లు యూరియా మండలానికి వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు అన్నారు.