జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుపై కృషి చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎర్రగడ్డలో బూతు స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. కెసిఆర్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయాలన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, పార్టీని బలోపేతం చేయాలని కోరారు. పార్టీ కోఆర్డినేటర్ సతీష్ ఆరోరా, కార్పొరేటర్లు పాల్గొన్నారు.