గోదావరి వరదతో మామిడికుదురు అప్పనపల్లి ముంపు బారిన పడింది. గోదావరిని ఆనుకుని ఉన్న ఈ గ్రామంలో ఇప్పటికీ కొబ్బరి తోటలు, కాజ్వే ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. గ్రామస్థులు వరద నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరితే గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోతుందని అధికారులు హెచ్చరించారు. ఈ గ్రామం పల్లపు ప్రాంతంలో ఉండటం వల్ల ప్రతి ఏటా వరద సమస్య వీరిని వేధిస్తోంది.