రెండు నెలల వ్యవధిలో తండ్రి కొడుకులు మృతి.. - శోకసముద్రంలో కుటుంబ సభ్యులు మృత్యువు వారిని వెంటాడింది సరిగ్గా రెండు నెలల వ్యవధిలో ఒకే తేదీన తండ్రి , కొడుకులు మృత్యువాతపడ్డ విషాద ఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులుతెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామ్ నగర్ కాలనీకి చెందిన మామిండ్ల రాజేశ్వర్ గౌడ్ అనే వ్యక్తి సింగరేణి లో రోజువారి కూలిగా చేసేవాడు. ఈ క్రమంలో అనారోగ్య బారిన పడిన ఆయన జూలై 5వ తేదీన మృత్యువాత పడ్డాడు. కాగా రెండు నెలలు అనంతరం అతని కుమారుడు అయిన మామిండ్ల రమేష్ సరిగ్గా తన తండ్రి చనిపోయిన తేదీన ఈనెల 5న మృతి చెందాడు.