సత్వర న్యాయం కోసం చట్టాలపై అవగాహనతో పాటు పేదరిక నిర్మూలన కోసం ఆమలు అవుతున్న సంక్షేమ పథకాలుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసు క్యాంపు ఆన్ నల్సా స్కీములుపై నిర్వహించిన ఒక్కరోజు అవగాహన సదస్సును జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.