కడప జిల్లా కమలాపురం నగరం పంచాయతీలోని వికలాంగుల కాలనీకి చెందిన షేక్.మౌలాలి(78) ఇతనికి అందరూ ఉండి ఎవరూ లేని అనాధగా బిక్షటను చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. ఇతను అనారోగ్యంతో గత ఐదు రోజుల క్రితం ఇంటిలో మరణించారు. శుక్రవారం ఇంటి నుండి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగువారు గమనించి ఆ ఇంటి పరిసరాల్లోకి వెళ్లలేక చరవాణి ద్వారా అభిచారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ విజయ్ బాబుకు విషయం తెలియజేశారు. అక్కడికి ట్రస్ట్ సభ్యుడు, ముదిరాజ్ అధ్యక్షులు రాము, చైర్మన్ విజయ్ బాబు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.