రెబ్బెన మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నెల రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ జరిగి ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందేనని SFI జిల్లా కార్యదర్శి సాయికృష్ణ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. ఫుడ్ పాయిజన్ జరిగి నెల రోజుల గడవక ముందే మరో పది మంది విద్యార్థులు విష జ్వరంతో బాధపడుతూ ఇంటి బాట పట్టారని ఆరోపించారు. జ్వరాలు వస్తె హాస్టల్ సిబ్బంది వైద్య పరీక్షలు చేయించాలి కానీ వారి తల్లిదండ్రులకు పోన్ చేసి పిల్లలను ఇంటికి తీసుకువెళ్లండి అని చెప్పడం తప్ప వైద్యం చేయించడం లేదని ఆరోపించారు.