ములుగు జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో అటవీ శాఖ అమర వీరుల స్మారక దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నేడు గురువారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ జిల్లా అధికారి రాహుల్ కిషన్ జాదవ్ పాల్గొని మాట్లాడుతూ...దేశంలోని అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన సందర్భంగా వీరుల త్యాగాన్ని స్మరించుకునే సెప్టెంబర్ 11న అటవీ అమరవీరుల దినోత్సవం ప్రతి ఏటా జరుపుకుంటున్నామన్నారు.