ప్రకాశం జిల్లా బెస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై శుక్రవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడాన్ని తెలుసుకున్న ఎస్సై రవీంద్రారెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని పోలీస్ వాహనంలో కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సకాలంలో గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించడం వల్ల రక్తస్రావాన్ని అరికట్టడం జరిగిందని వైద్యులు అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన పోలీసులను పలువురు ప్రశంసిస్తున్నారు.