ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణంలో ప్రైవేట్ భాగస్వామ్య నిర్ణయాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని జోడిస్తూ టిడిపి క్యాబినెట్ చేసిన నిర్ణయాన్ని సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ ఖండిస్తూ శుక్రవారం పార్వతీపురం స్థానిక సుందరయ్య భవనం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి, కాంప్లెక్స్ కూడలి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు ఏం.కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు.