నగరంలోకి అనుమతి లేకుండా వచ్చిన భారీ వాహనాలకు జరిమానా విధిస్తున్నట్లు ట్రాఫిక్ సిఐ నిత్య బాబు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద అనుమతి లేకుండా నగరంలో వస్తున్న లారీ, మినీ లారీ, టెంపో, వ్యాన్, కంటైనర్లు వంటి భారీ వాహనాలకు ట్రాఫిక్ సీఐ నిత్య బాబు ఆదేశాల మేరకు ఎస్సై రాజు , ఏ ఎస్ ఐ లోకనాథంతో కలిసి జరిమానాలు విధించారు. మధ్యాహ్నం రెండు గంటల పైన భారీ వాహనాలు నగరంలోకి రావాలని అంతకుముందు వచ్చే వాహనాలకు జరిమానా తప్పదని సీఐ నిత్య బాబు హెచ్చరించారు.