జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ 2025–26 లో భాగంగా రాయచోటిలో 5K రెడ్ రన్ మారథాన్ జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి ప్రారంభమైన ఈ రన్‌లో వివిధ కళాశాలల 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.అడిషనల్ డీఎంహెచ్ఓ డా. రమేష్ బాబు మాట్లాడుతూ యువతీయువకులు హెచ్‌ఐవి/ఎయిడ్స్ పై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రోగ్రామ్ మేనేజర్ భాస్కర్ వేంపల్లె, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ గౌస్ భాష, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ మునియ నాయక్ మాట్లాడారు.మారథాన్‌లో అబ్బాయిల విభాగంలో ఎం. నాని, అమ్మాయిల విభాగంలో ఫిర్దోస్ భాను లు బహుమతులు గెలుచుకున్నారు