నల్లగొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ ను వెంటనే పరిష్కారం చేయాలని నిర్మాణ రంగంలో పనిచేస్తున్న 60 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి వెల్ఫేర్ బోర్డు ద్వారా 9 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆదివారం స్థానిక సుందరయ్య భవన్లో నల్లగొండ మండల భవన నిర్మాణ కార్మికుల జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. అనేక పోరాటాల ఫలితంగా 1996లో వెల్ఫేర్ బోర్డు సాధించుకున్నామని అన్నారు. అనునిత్యం కార్మికుల హక్కుల కోసం సిఐటియూ పోరాటం చేస్తుందన్నారు.