వసతి గృహంలో ఉండే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు బిక్కనూర్ బీసీ వసతి గృహం వార్డెన్ సునిత చెప్పారు. ఆదివారం తల్లిదండ్రుల సమావేశం వసతి గృహంలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వసతి గృహం నుంచి విద్యార్థులు ఇంటికి వచ్చినప్పుడు సెల్ ఫోన్ ఇవ్వవద్దని సూచించారు.