జిల్లాలో అనీమియా ఎక్కువగా ఉందని, దానిని పూర్తిగా నివారించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ బుధవారం తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం అందించే పౌష్టికాహారంతో పాటు ఐసీడీఎస్, డీఆర్డీఏ ద్వారా అనేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు 21 రకాలు కలిగిన అదనపు కిట్లను ఐసిడిఎస్ ద్వారా పంపిణీ చేస్తున్నామని, తద్వారా గర్భిణీలలో రక్తహీనత సమస్య తలెత్తరాదని అన్నారు. అయినప్పటికీ రక్తహీనత ఉంటే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. పోషకాహారం కలిగిన కిట్లు పంపిణీ చేయడంతోనే బాధ్యత అయిపోదన్నారు.