జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామంలోని ఆయిల్ పామ్ తోటలను జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి జి. శ్యాంప్రసాద్, ఉద్యాన అధికారి కె. స్వాతి, లోహియా కంపెనీ జిల్లా మేనేజర్ విజయ్ భరత్ పరిశీలించారు.ఈ సందర్బంగా శ్యామ్ ప్రసాద్ అయా రైతులతో మాట్లాడుతూ... ప్రస్తుతం 30 నెలల వయసున్న ఆయిల్ పామ్ తోటల్లో పూత తీసివేయకుండా ఉంచుకోవాలని, త్వరలో ఆ తోటలలో పరాగ సంపర్కం కోసం పురుగులను విడుదల చేస్తామని తెలిపారు. చెట్ల పాదులలో ఎలాంటి గడ్డి మందులు పిచికారీ చేయవద్దని, మట్టలు కోయవద్దని సూచించారు. అలా చేసినచో మగ పూత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు .