భూపాలపల్లి సింగరేణి ఏరియా పరిధిలోని కేటీకే ఒకటో గాని బాధ్యతలో భాగంగా వరుసగా మూడుసార్లు బహుమతులు గెలుచుకోవడం చాలా అభినందనీయమని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు మంగళవారం సాయంత్రం 3 20 గంటల సమయంలో ఒకటో గని ఆవరణలో నిర్వహించిన 55 వార్షిక భద్రత పక్షోత్సవాల సందర్భంగా పోటీలలో ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి సాధించినందుకు గాను అక్కడే అధికారుల సిబ్బందిని అభినందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిఎం ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాలు ఉద్దేశించి మాట్లాడారు.