జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో గ్రామపంచాయతీ ముసాయిదా ఓటర్ల జాబితా వార్డుల వారీగా ప్రచురించడం జరిగిందని, మండల కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రచురించడం జరిగిందని ఆసిఫాబాద్ జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్ గురువారం తెలిపారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శి, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు తెలియపరచాలని, ఈనెల 31 వ తేదీ వరకు అభ్యంతరాలను పరిశీలించి సెప్టెంబర్ 2వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో తుది ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. ఓటర్ల జాబితా నేపథ్యంలో ఈనెల 29వ తేదీన జిల్లా స్థాయిలో జిల