జగిత్యాల జిల్లా కోరుట్ల సీఐ సురేష్ బాబు ఔదార్యాన్ని చాటుకున్నారు జగిత్యాల నుండి కోరుట్ల వైపు వస్తుండగా, కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సీఐ క్షతగాత్రులను పోలీసు వాహనంలో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, దీంతో గాయం అయిన వారు ప్రణాపయస్థితి నుండి బయటపడ్డారు, ఈ సందర్భంగా సిఐ సురేష్ బాబుకు బాధితులు కృతజ్ఞత తెలిపారు