గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని రామిరెడ్డి తోట - ప్రకాష్ నగర్ వద్ద శుక్రవారం సాయంత్రం మణిపురం బ్రిడ్జి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుండి వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. వెంటనే స్థానికులు కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.