అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టిన కారు, తప్పిన ప్రమాదం, ఎడుగురికి గాయాలు రామాయంపేట మండల కేంద్రంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ వైపు నుండి మిరుదొడ్డి మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి వెళ్తున్నా ఎర్టిగా కారు భారీ వర్షంలో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ఉన్న ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే 108 సిబ్బంది రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయాలైన వారు నిజామాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు.