సిర్పూర్ టి మండలంలోని హుడికిలి, వెంకట్రావు పేట వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాకపోకలను నిలిపివేసినట్లు సిర్పూర్ ఎస్సై కమలాకర్ తెలిపారు. వరద నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్ రాకపోకలను నిలిపివేసినట్లు ఎస్సై తెలిపారు. దిగువన ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో వాగుల వద్దకు స్నానాలకు గాని చేపల వేటకు గాని వెళ్లకూడదని సూచించారు,