కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తగ్గించడాన్ని హర్షిస్తూ సోన్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం నిర్వహించారు. మండల అధ్యక్షులు మార గంగారెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గించడం సామాన్యులకు ఊరట కలిగించే విషయమని అన్నారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ రేట్ల తగ్గింపు ద్వారా సామాన్యులు, రైతులు, విద్యార్థులు, మహిళలకు ప్రయోజనం కలుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు నరేష్, మండల ప్రధాన కార్యదర్శులు సుంచు సవీన్, సంతోష్, ఉపాధ్యక్షులు గంగయ్య, నాయకులు భూమేష్, రాజేశ్వర్, మనోహర్