నిర్మల్ జిల్లాకేంద్రంలో ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పట్టణమంతా అతలాకుతులమైంది. ఎటువైపు చూసిన వరద ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇంద్రనగర్, శివాజీ చౌక్లో ఇళ్ల ముందు ఉంచిన బైక్లు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇందులో కొన్ని వాహనాలు మురికి కాలువలో దర్శనమిచ్చాయి