నారాయణపేట మండల పరిధిలోని ఏక్లాస్ పూర్ గ్రామంలో ఒకే ఒక గణేశుని ప్రదర్శించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని నారాయణపేట ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారము అందాజ రెండు గంటల సమయంలో గణేసునికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని, గ్రామంలో ఒకే ఒక గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా ఏక్లాస్ పూర్ గ్రామస్తుల ఐక్యత సోదర భావాన్ని చాటు తుందని తెలిపారు. డీజే లకు అనుమతి లేదని భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ పద్ధతులలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎస్సై తెలిపారు.